శ్రీమతి షర్మిల రక్తదానం
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ 64వ జయంతిని పురస్కరించుకుని విశాఖపట్టణం జిల్లా సరిసల్లిలో ఆయన తనయ శ్రీమతి వైయస్ షర్మిల నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఆమె రక్తదానం చేశారు. విశాఖ జిల్లా సరిపల్లిలో రాత్రి బస చేసిన ప్రాంతంలోనే ఆమె రక్తదానం చేశారు. శ్రీమతి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, వైయస్ విజయమ్మ సోదరి కూడా రక్తదానం చేశారు. డాక్టర్ హరికృష్ణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. మహానేత అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేసి...తమ అభిమానం చాటుకున్నారు. వైయస్ఆర్ జయంతి సందర్భంగా శ్రీమతి షర్మిల అనాధ, అంధ విద్యార్థులను కలుసుకున్నారు. వారికి దుస్తులు, బ్రెడ్, పళ్లు పంపిణీ చేశారు. సరిపల్లిలోనే మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతు బాంధవుడు వైఎస్ఆర్ జయంతిని పురష్కరించుకుని షర్మిల సర్వమత ప్రార్థనలు చేశారు.