వైయస్‌ జగన్‌కు శెట్టిబలిజలు కృతజ్ఞతలు

28 Nov, 2018 15:19 IST


శ్రీకాకుళంః శెట్టిబలిజ కులస్తులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.తమ కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఇస్తామని హామీ ఇచ్చిన వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. ఇప్పటి వరుకూ  తమ కులాన్ని ఎవరు పట్టించుకోలేదని, ఏ నాయకుడూ తమ గురించి ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  రాజకీయం పదవుల్లో కూడా శెట్టిబలిజలకు అన్యాయం జరుగుతుందన్నారు. శెట్టిబలిజలను టీడీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకులాగానే వాడుకుందని, బీసీల పార్టీ అని చెప్పుకోవడమే తప్ప బీసీలకు సాయం చేయలేదన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో బీసీలకు నాయ్యం జరిగిందన్నారు. రాజన్న తనయుడు వైయస్‌ జగన్‌ ప్రకటనతో శెట్టిబలిజలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.  వైయస్‌ఆర్‌సీపీకి బీసీలందరూ  చేదోడువాదోడుగా ఉంటామన్నారు. వైయస్‌ జగన్‌ను గెలిపించుకుంటామన్నారు.