లోక్‌సభలో జగన్ `సేవ్ ఆంధ్రప్రదేశ్' నినాదాలు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా సభలో మళ్ళీ గళమెత్తారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్... జై సమైక్యాంధ్ర' నినాదాల మధ్య లోక్‌సభ బుధవారం నాటికి వాయిదా పడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ శ్రీ వైయస్ జగన్, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి మంగళవారం సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ పోడియం ముందు నిరసన నినాదాలు చేశారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ శ్రీ జగన్తో పాటు ఎంపీలు నినదించారు. ఈ గందరగోళం మధ్యే మంత్రులు, వివిధ కమిటీల సభ్యులు నివేదికలను సభకు సమర్పించారు. దాదాపు 15 నిమిషాల సేపు నివేదికల సమర్పణ కార్యక్రమం కొనసాగింది. అవిశ్వాస తీర్మానాలపై 50 మంది సభ్యులను లెక్కించేందుకు సహకరించాలని ఆందోళన చేస్తున్న సభ్యులను స్పీకర్ కోరారు. అయితే వారెవరూ పట్టించుకోకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.