సర్కారుతో చంద్రబాబు చీకటి ఒప్పందం: కృష్ణదాస్
14 Mar, 2013 11:34 IST
హైదరాబాద్ 14 మార్చి 2013:
ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రభుత్వంతో ప్రతిపక్షనేత చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకుని సర్కారును కాపాడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం పోషించాల్సిన పాత్ర వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోషిస్తూ, అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.