శనివారం నాటి పాదయాత్ర 14.9కి.మీ
9 Feb, 2013 09:21 IST
మాల్(నల్గొండ)
: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం శనివారం నాడు 14.9 కిలోమీటర్లు సాగుతుంది. నల్గొండ జిల్లా మాల్ నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. తిరుగండ్లపల్లిలో భోజన విరామం తీసుకుంటారు. ఎర్రగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడ, తోట వరకూ సాగుతుందని కార్యక్రమ సమనకవయకర్త తలశిల రఘురాం తెలిపారు.