'సహకార ఎన్నికల్లో గెలుపే లక్ష్యం'
11 Jan, 2013 11:38 IST
విజయవాడ:
త్వరలో జరగనున్న సహకార సంఘాల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఉదయభాను సూచించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్యనేతలతో పార్టీ కేంద్ర విధాన మండలి సభ్యులు ఎం.వి. మైసూరారెడ్డి, సోమయాజులు సహకార ఎన్నికలపై సమీక్షించారన్నారు. సహకార సంఘాల సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందని, కొత్త ఓటర్ల జాబితాను ఈ నెల 21న ఆయా సహకార సంఘాల్లో ప్రదర్శించనున్నారని తెలిపారు. ఆ తర్వాత పార్టీ బలాబలాలను పరిగణలోకి తీసుకుని వివాదరహితులైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని పార్టీ యోచిస్తోందన్నారు. నగరంలో సమావేశం నిర్వహించి జిల్లాలోని 425 సహకార సంఘాల్లో అభ్యర్థుల గెలుపు కోసం చర్చించనున్నట్లు ఉదయభాను తెలిపారు.