'సహకార' ఎన్నికల అభ్యర్థి కిడ్నాప్
24 Jan, 2013 10:22 IST
చిత్తూరు, 24 జనవరి 2013:
చిత్తూరులో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సహదేవ్ నాయుడును కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అపహరించి తీసుకుపోయారు. సహకార సంఘాల ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి వెళుతున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ కిడ్నాప్ ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు.
'అభ్యర్థులు లేకే ఎన్నికలు వాయిదా' :
కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేకపోడం వల్లే ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని 11 సహకార సంఘాల ఎన్నికలను వాయిదా వేసిందని వైయస్‌ఆర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. ఈ సహకార సంఘాల ఎన్నికలను వాయిదా వేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు.
అంతకు ముందు చిత్తూరు జిల్లాలో 11 సహకార సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఎన్నికల రద్దుపై అర్థరాత్రి జీఓ విడుదల చేసింది.