5న పరిగిలో రైతు ధర్నా
పరిగి : మండల వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ మండల కన్వీనర్ జయరామ్ తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు శంకరనారాయణ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఇప్పటి వరకు ఇన్‌పుట్ సబ్సీడీ, ఇన్సూరెన్స్ ప్రభుత్వం ప్రకటించనందుకు నిరసనగా ఈ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలోని రైతు సోదరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మారుతీశ్వరావు, బిసిసెల్ నాయకులు రమణ, ప్రభు, సేవాదల్ నాయకులు మారుతిరెడ్డి, సురేష్రెడ్డి, సింగారెడ్డి, శివ, మూర్తి, బాలు తదితరులు పాల్గొన్నారు.