కనికరం లేని ప్రభుత్వం

31 Jan, 2017 17:48 IST
కొండాపురం : వర్షాలు లేక రైతులు కరువు, కాటకాలతో అల్లాడుతున్నా ప్రభుత్వానికి కొంచెమైనా కనికరం లేదని వెల్లిగండ్ల పంచాయతీ ప్రజలు వైయస్‌ఆర్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి మొరపెట్టుకున్నారు. వెలిగండ్ల గ్రామ పంచాయతీలో మంగళవారం గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు వారి సమస్యలను ఆయనతో చెప్పుకున్నారు. వర్షాలు సక్రమంగా లేక కరువు వచ్చిందన్నారు. దీంతో గ్రామాలు వదలి బయట ప్రాంతాలకు వలసలు వెళ్తున్నామని వాపోయారు. ఇంత కరువు వచ్చిన ప్రభుత్వం మాత్రం కన్నెత్తి కూడా రైతుల పరిస్థితిని చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు చేత పట్టుకోని పనుల కోసం సుదూరం వెళ్తున్నామని చెప్పారు. అనంతరం మేకపాటి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సాగు చేసి పంటలకు నీరు లేక ఎండిపోయే పరిస్థితులు వచ్చాయని రైతుల సమస్యలు పట్టించుకోనే నాధుడు కరువయ్యాడని మండిపడ్డారు.  రైతులు ఇబ్బందులు పడ్డుతున్న ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ప్రభుత్వం వస్తోందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రైతుల కష్టాలు తీరుతాయని వారికి భరోసా కల్పించారు. ఆయన వెంట మండల కన్వీనర్‌ నరసింహరావు, వేమిరెడ్డి మల్లికార్జునరెడ్డి, పిన్నిక కొండయ్య, అరవ మాలకొండయ్య, తదితరులు పాల్గొన్నారు.