అభివృద్ధి పనులకు రోజా శంకుస్థాపన
13 Apr, 2017 15:44 IST
నగరిః ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు కేటాయించకుండా చంద్రబాబు రాష్ట్రంలో కుట్రపూరిత పరిపాలన సాగిస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు మండలం తడుకు పంచాయతీ పరిధిలోని టీ.ఆర్.కండిగ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోజా శంకుస్థాపన చేశారు. రూ. 4 లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా డ్రైనేజీ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత పాటించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.