టీడీపీ నేతల పిచ్చి ప్రేలాపనలు

4 Aug, 2017 14:32 IST

నంద్యాలః బహిరంగసభకు తరలివచ్చిన జనాన్ని చూసి టీడీపీ నేతలకు తడిసిపోయిందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అందుకే పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఫైర్ అయ్యారు. హత్యా రాజకీయల చరిత్ర చంద్రబాబుదని రోజా ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను బాబు మోసం చేశాడని రోజా మండిపడ్డారు. వైయస్ జగన్ మాటలకు సమాధానం చెప్పే ధైర్యం టీడీపీ నేతలకుందా అని రోజా ప్రశ్నించారు.