విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

28 Jan, 2018 15:38 IST
  • కడుపు, కాలు నొప్పులతో వెళ్లి ఏం సాధించావ్‌
  • అంతా నా గురించే మాట్లాడారనడం విడ్డూరం
  • డబ్బులు దాచుకోవడానికి దావోస్‌ వెళ్లింది వాస్తవం కాదా
  • ఎక్కడ ఎంత దాచారో సమయం వచ్చినప్పుడు చెబుతాం
  • నాలుగేళ్ల తరువాత కేంద్రానికి దండం అనడం సిగ్గుచేటు
  • దైవభక్తి పేరుతో క్షుద్రపూజలు చేస్తూ సుద్దులు మాట్లాడుతారా
  • కేంద్రంతో చేతులు కలిపి ఎన్ని కేసులు మాఫీ చేయించుకున్నారు బాబూ
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
  • విశాఖపట్నం:

    చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసి రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేశాయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాకుండా దావోస్‌ పర్యటనకు వెళ్తారని, ప్రజలంతా అంతకంటే ముఖ్యమైనది ఉండొచ్చని భావిస్తే చంద్రబాబు మాత్రం దావోస్‌లో అంతా నా గురించే మాట్లాడుకుంటున్నారనడం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బొత సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశ ప్రధాని గురించి గానీ, దేశ దేశల నుంచి వచ్చిన వారిని వదిలి నా గురించే మాట్లాడారని సొంత డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. దావోస్‌ నుంచి తిరిగి వచ్చి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ‘నాకు చెయ్యి నొప్పి, కడుపులో బాగులేకున్నా రాష్ట్రం కోసం దావోస్‌కు వెళ్లానని, బీజేపీ వారు వద్ద అనుకుంటూ ఒక నమస్కారం పెట్టి వద్దనుకుంటాను. కులాలకు, మతాలకు అతీతంగా అందరూ సూర్యనమస్కారాలు చేయాలని, 

    ఆఖరిగా  కేసుల మాపీ కోసమే వైయస్‌ జగన్‌ బీజేపీతో పొత్తుకు తాపత్రయపడుతున్నారని చెప్పారన్నారు.

         

    ఎక్కడ ఏం దాచుకున్నారో చెబుతాం..

    చంద్రబాబు విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి మిగిలింది శూన్యమని బొత్స ధ్వజమెత్తారు. మీరు తెచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రరాష్ట్రం 13 జిల్లాలో ఇన్ని పరిశ్రమలు, ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పండి మహానుభావ అని అడిగితే.. సమాధానం ఉండదని, ఎంతసేపటికీ ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కొత్త నాటకం తెరమీదకు తీసుకువస్తున్నారు. కడుపునొప్పి, చెయ్యినొప్పిని సానుభూతిగా మలుచుకొని చేతగాని తనం కప్పిపుచ్చుకునే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదదన్నారు. ఒక వేళ నొప్పులు వస్తే అంతబాధపడి దావోస్‌కు వెళ్లి ఏం సాధించావని ప్రశ్నించారు. చంద్రబాబు పెట్టుబడులు తేవడానికి కాదు.. ఇక్కడ దోపిడీ సొమ్మును దాచుకోవడానికి సింగపూర్‌కు వెళ్తున్నారని బొత్స విమర్శించారు. సమయం వచ్చినప్పుడు ఎక్కడ ఏం దాచుకున్నారో చెబుతామని బొత్స హెచ్చరించారు. 

    విభజన అంశాలు ఏమయ్యాయి..

    కేంద్రానికి మీరు దండం పెడతారో.. మీకు కేంద్రం పెడుతుందో మాకు సంబంధం లేదని, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు పోలవరం, ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రప్యాకేజీ, రైల్వేజోన్‌ వంటి అంశాలు ఏమయ్యాయని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయి ఇక్కడి వారు అక్కడ.. అక్కడి వారు ఇక్కడ మంత్రులు ఉన్న సమయంలో బీజేపీకి ఒక నమస్కారం అని మాట్లాడడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్తాం.. దండం పెడతాం ఏంటీ బేలతనం మాటలని చంద్రబాబును నిలదీశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆడిన మాటలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. గతంలో రాష్ట్ర విభజన అంశాలపై ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పోరాడుతుంటే అభివృద్ధి నిరోధకులని చంద్రబాబు కించపరిచారని మండిపడ్డారు. వైబుల్టి లేదు అందుకే రైల్వేజోన్‌ ఇవ్వడం లేదన్న కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను బొత్స ఖండించారు. వైబుల్టి ఏంటీ ఇదేమైనా వ్యాపారమా..? మీ వ్యాపారాలు, మీ బ్యాంక్‌ లావాదేవీల గురించి అందరికీ సుజనా చౌదరి అని బొత్స విరుచుకుపడ్డారు. ఇటీవల ప్రధానిని కలిసిన చంద్రబాబు ఒక తప్పు చేశారని, దుగ్గరాజపట్నం పోర్టును 18 సంవత్సరంలోగా ఒక ఫేజ్‌ పూర్తవ్వాలని విభజన చట్టంలో ఉంటే.. దుగ్గరాజపట్నం పోర్టు ఇవ్వలేకపోతే ఎకనామిక్‌ జోన్‌ ఇవ్వమని చంద్రబాబు కోరుతున్నారని మండిపడ్డారు. ఈ విధంగా ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వస్తే దావోస్‌ సమ్మిట్‌లు అవసరం లేదు. కాలు, కడుపు, చెయ్యి నొప్పులు అవసరం లేదని సూచించారు. 

    సుద్దులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్‌

    ఏదైనా మాట్లాడేముందు మనం ఎంత వరకు పాటిస్తున్నామో చూసుకోవాలి చంద్రబాబూ అని బొత్స విమర్శించారు. కులాలకు, మతాలకు అతీతంగా అందరూ సూర్యనమస్కారాలు చేయాలని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఒక పక్క ప్రభుత్వ, దేవాలయ భూములను అమ్మేస్తూ, మరో పక్క దైవభక్తి పేరుతో క్షుద్రపూజలు చేయిస్తారు.. ఇవన్నీ చేస్తూ సుద్దులు మాట్లాడడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. 

    కేసుల మాఫీని బాబే ఒప్పుకున్నాడు..

    పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని చంద్రబాబు మాటల్లో అర్థం అయిందని బొత్స అన్నారు. బీజేపీతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేసుల మాఫీ కోసం పొత్తు పెట్టుకుంటుందని మాట్లాడడం అందుకు నిదర్శనమన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసివుంటే కేసులు మాఫీ అవుతాయని చంద్రబాబే అంగీకరించారన్నారు. ఇప్పటికీ ఎన్ని కేసులు మాఫీ చేయించుకున్నారు చంద్రబాబూ అని బొత్స ప్రశ్నించారు. అలాగే ఓటుకు కోట్ల కేసులో తప్పించుకున్నట్లుగా ఉన్నాడన్నారు. అంతేకాకుండా వారితో పొత్తు పెట్టుకొని పోలవరం, పట్టిసీమ, రాజధాని భూకుంభకోణాలపై విచారణ జరగకుండా చూసుకున్నాడని ఆరోపించారు. పార్టీలతో పొత్తులు ఉంటే కేసులు మాఫీ అవుతాయని చంద్రబాబే చెబుతున్నాడన్నారు.