ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై చర్చకు సిద్ధమా..?

15 Aug, 2017 14:37 IST
నంద్యాల:  రాయలసీమలోని కేసీ కెనాల్‌ కింద పంటలు ఎండిపోవడానికి చంద్రబాబే కారణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి  ఆరోపించారు. చంద్రబాబు సీమలో కనీసం వెయ్యి ఎకరాలకైనా నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. కర్ణాటకలో జలాశయాలు నిండినా.. ఏపీకి నీళ్లు రావడం లేదన్నారు. దీంతో రాయలసీమలో కరువు తాండవం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు లేఖ రాయడం లేదని నిలదీశారు. కనీసం కృష్ణాబోర్డుకు కూడా చంద్రబాబు లేఖ రాయలేదని ఎద్దేవా చేశారు. గుండ్రేవుల ప్రాజెక్ట్‌తోనే కేసీ కెనాల్‌ స్థిరీకరణ జరుగుతోందన్నారు.