రాజన్న కలలు సాకారం చేసేందుకే పాదయాత్ర

18 Oct, 2012 01:08 IST

ఇడుపులపాయ నుండి: అక్టోబర్‌ 18, 2012 : మూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు ముందు షర్మిల తండ్రి వైయస్ఆర్‌కు నివాళులు అర్పించారు. వైయస్ఆర్‌ఘాట్‌ వద్ద పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైయస్. భారతి తదితరులతో కలిసి ఆమె ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రంలో వేలాదిగా జనం పాల్గొన్నారు. శోభా నాగిరెడ్డి, వైయస్.వివేకానంద రెడ్డి ఆమె వెంట ఉన్నారు. రాజన్న కలలను సాకారం చేసేందుకే షర్మిల పాదయాత్ర సాగుతుందని వైయస్‌ సోదరుడు  వైయస్‌.వివేకానందరెడ్డి చెప్పారు. రాజన్న కలలు కన్న సంక్షేమరాజ్యస్థాపన కోసం, వైయస్‌ ఆశయాలను పూర్తి చేసేందుకు, పేదకుటుంబాలకు న్యాయం జరిగేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఇటీవల ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి కూడా ఆయన నివాళులు అర్పించడానికి ఇడుపులపాయ వచ్చారు. నిజానికి డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారనీ, అయినప్పటికీ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్దొనేందుకు వచ్చాననీ ఆయన చెప్పారు. ఇడుపులపాయలో వైయస్‌ ఘాట్‌ వద్ద జరిగిన సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు.
వైయస్‌ కుటుంబం పట్ల ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలసి జగన్‌కు కనీసం బెయిలు ఇవ్వడానికి కూడా వీలు లేకుండా చేశారని ఆయన వివేకానంద రెడ్డి వ్యక్తం చేశారు. ఈ తీరును నిరసిస్తూ, ప్రజల్లోకి పోతున్నామనీ షర్మిలకు బాసటగా రాష్ట్రప్రజలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఆయన చెప్పారు.
ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వేధింపులు, సాధింపులున్నా లక్షలాది కార్యకర్తలు రాజన్న కలలను సాకారం చేసుకునేందుకు కదులుతున్నారనీ ఆయన అన్నారు. ''వైయస్‌ ఆశయాలు నెరవేరాలి. చేపట్టిన కార్యక్రలు కొనసాగాలి. పేదకుటుంబాలకు న్యాయం జరగాలి. ప్రాంతీయ అసమానతలకు కారణమయే ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఈ దిశగా ప్రజలను మేలుకొలిపేందుకే ఈ మరో ప్రజాప్రస్థానం. మూడువేల కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. జోహార్ రాజన్న అన్న నినాదాలు మిన్నంటగా ఆయన రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద వైయస్సార్ సీపీ నాయకులు నివాళులర్పించారు.వైయస్సార్ సీపీ నాయకులు రోజా, శోభా నాగిరెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజా మాట్లాడుతూ మరే మహిళా చేయని సాహసం షర్మిల చేస్తున్నారన్నారు. తండ్రి అడుగుజాడల్లో, అన్న ఆశయాల సాధన కోసం ఈ పాదయాత్ర సాగుతుందన్నారు.