సకాలంలో వర్షాలు కురవాలి
5 Apr, 2017 11:45 IST
ప్రకాశం: సకాలంలో వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆయన, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మలు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ శ్రీరామనవమి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.