వైయస్‌ జగన్‌ పట్టుదలకు హ్యాట్సాఫ్‌

10 Jul, 2018 15:39 IST
 
– వైయస్‌ జగన్‌ బస చేసిన ప్రాంతం బురదమయం
– వర్షం కారణంగా రోడ్డుపై నిలిచిన నీరు
తూర్పు గోదావరి:  మొక్కవోని దీక్షతో, అచెంచల విశ్వాసంతో ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ పట్టుదలకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి అక్కడ వర్షం కురుస్తుండటంతో రోడ్డుపై నీరు నిలిచింది. వైయస్‌ జగన్‌ బస చేసిన ప్రాంతమంతా బురదమయం అయ్యింది. జోరుగా వర్షం కురుస్తున్నా..రోడ్డుపై నీరు నిలిచినా వైయస్‌ జగన్‌ మొక్కవోని దీక్షతో పట్టుదలగా ఉన్నారు. బస చేసిన ప్రాంతం బురద, ఈగలు, దోమలతో ఉందని స్థానికులు చెబుతున్నారు. వర్షం కారణంగా షెడ్డుపై శబ్ధాలు వస్తున్నాయి. ఈ Ô¶ బ్ధాలకు నిద్ర కూడా పట్టని పరిస్థితి ఉంటుందన్నారు. అయినా తన సంకల్పం విడువకుండా ప్రజల మధ్యే నివాసం చేయడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి నాయకుడ్ని ఇంతవరకు చూడలేదని రాయవరం మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సంకల్ప యాత్ర వైయస్‌ జగన్‌ సంకల్పానికి గొప్ప ఉదాహరణ అన్నారు. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.