రేపు ఖమ్మం జిల్లాలో విజయమ్మ పర్యటన

7 Nov, 2012 08:52 IST
హైదరాబాద్:

ఖమ్మం జిల్లాలో నీలం తుపాను బాధిత ప్రాంతాలను వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గురువారం (ఈ నెల 8న) సందర్శిస్తారు.  పార్టీ అడ్‌హాక్ కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించారు. పర్యటన వివరాలు తెలిపారు. విజయమ్మ 8 వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి కృష్ణా ఎక్సుప్రెస్‌లో బయలుదేరి 11 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం అర్బన్, పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, వైరా పరిధిలోని కొణిజర్ల, మరో పది గ్రామాల్లో ఆమె పర్యటిస్తారని అజయ్‌కుమార్ వివరించారు. విజయమ్మ రైతులను కలుసుకుని వారిని పరామర్శిస్తారని ఆయన తెలిపారు. పర్యటన ముగిసిన తరువాత అదే రోజు సాయంత్రం రోడ్డు మార్గంలో విజయమ్మ హైదరాబాద్‌కు వెడతారు.