రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
13 May, 2017 11:05 IST
వైయస్ఆర్ కడప: ప్రొద్దుటూరు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. వైయస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో నామాలగుండు వద‍్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాచమల్లు ప్రసాదరెడ్డి సహా ఆయన కుటుంబసభ‍్యులు గాయపడ్డారు.
ప్రసాదరెడ్డి కుటుంబ సమేతంగా కారులో పులివెందుల మీదుగా బెంగుళూరుకు వెళుతుండగా ఎదురుగా వస్తున‍్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో శాసనసభ‍్యుడు, ఆయన కుటుంబసభ‍్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున‍్న పులివెందుల పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని పులివెందుల ఆస‍్పత్రికి తరలించారు.