రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో విజయమ్మ భేటి

8 Oct, 2012 04:58 IST
న్యూఢిల్లీ, 8 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో కలిశారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్‌రెడ్డి కేసు విషయంలో సిబిఐ అనుసరిస్తున్న తీరును ఆమె రాష్ట్రపతికి వివరించారు. ఆమెతో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.