రాజకీయ కుట్రతోనే జగన్మోహన్‌రెడ్డి నిర్బంధం
రాజకీయ కుట్రతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని నిర్బంధించినట్లు న్యాయవాదులు, మేధావులు, సామాజికవేత్తలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, టిడిపి నాయకులు కుమ్మక్కై సిబిఐని వాడుకుని ఆయనను జైలులో పెట్టించారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని వారంతా హెచ్చరించారు. ఈ పరిణామాలతో న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారని, దీనిని కోర్టులు సైతం గమనిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. నెల్లూరులోని హరిత హోటల్‌లో ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో చైతన్యపథం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి కార్యాలయ విశ్రాంత ఉద్యోగి రామ్మూర్తి మాట్లాడుతూ, శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నిర్దోషి అని, ఆయనపై గాని, విజయ సాయిరెడ్డిపై గాని ఎలాంటి కేసూ లేదన్నారు. క్విడ్ ప్రో కో అంటే పరస్పర సహకారమని, శ్రీ జగన్‌కు ఆ జీఓలు, లావాదేవీలతో ఏమీ సంబంధం లేదన్నారు. ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థపై ఏమాత్రం గౌరవం ఉన్నా సెప్టెంబర్ 5న శ్రీ జగన్‌కు బెయిల్ ఇవ్వాలన్నారు.
ఒక్క కాంగ్రెస్‌తోనే కాకుండా ప్రధాన ప్రతిపక్షం టిడిపితో కూడా సిబిఐ కుమ్మక్కైందని, శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలు నుంచి బయటకు రానివ్వకుండా అవి కుట్రలు పన్నుతున్నాయని కొమరిక గ్రామానికి చెందిన రైతు గూడూరు ప్రభాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ అనేది ఓ నైతిక హక్కు అని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని న్యాయవాది బసిరెడ్డి నారాయణరెడ్డి విమర్శించారు.
శ్రీ జగన్ కేసులో అన్నీ ప్రశ్నలే తప్ప సమాధానాలు లేవని మరో న్యాయవాది సత్యనారాయణ అన్నారు. మాయావతి, ములాయంసింగ్‌లపై అనేక కేసులు ఉన్నాయి, కాంగ్రెస్ నాయకులు పలు కుంభకోణాల్లో కీలకంగా ఉన్నారు. వీరి విషయంలో సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని డాక్డర్ ఎ.వి.ఎస్. రెడ్డి విమర్శించారు. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహానేత వైయస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కష్టాలకు గురిచేయడం దారుణమని, కక్షసాధింపు చర్యేనని రాధికారెడ్డి విమర్శించారు. దోషా, నిర్దోషా అనేది తేల్చకుండా ఏడాదిగా జైలులో బంధించి, వేధిం చడం దారుణమని సాహితీవేత్త మెట్టు రామచంద్రప్రసాద్ విమర్శించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులో పెట్టి వేధించడం రాజకీయ కుట్ర అని అందరికీ అర్థం అవుతోందని న్యాయవాది గోవిందరాజుల సుభద్రాదేవి అన్నారు.