ప్రజా సమస్యలు పరిష్కరించాలి

21 Apr, 2017 18:45 IST

పుంగనూరు : మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని ఊటూరు గ్రామంలో ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్‌అమరనాథరెడ్డితో సమస్యలపై చర్చించారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, తక్షణం నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంటురోగాలు ప్రబలకుండా వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండకు పిల్లలు, వృద్ధులు బయట తిరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ రామచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దుర్గారాజారెడ్డి, వైయ‌స్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.రెడ్డెప్ప, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మజ్దూర్ యూనియన్ కార్యదర్శి జయరామిరెడ్డి, చెంగారెడ్డి, కౌన్సిలర్ మనోహర్, కో–ఆప్షన్‌మెంబర్ ఖాదర్‌బాషా, యువజన సంఘ నాయకులు రాజేష్, సురేష్, రమణ, భాస్కర్‌పాల్గొన్నారు.