టీడీపీపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత
నెల్లూరు(పొదలకూరు): టీడీపీపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందన్న విషయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేటతెల్లం అయినట్టు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నంరెడ్డి అశోక్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారం, ధన బలంతో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను కైవసం చేసుకున్న టీడీపీకి ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. టీడీపీ తన కంచుకోటగా భావించే అనంతపురం జిల్లాలో వైయస్ఆర్‌సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మొదలైందని జోస్యం చెప్పారు. మేధావులు, నిరుద్యోగ యువకులు, రైతులు తమ పార్టీ వెన్నంటి ఉన్నట్టు పేర్కొన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఇదే తీర్పును ప్రజలు ఇవ్వనున్నట్టు తెలిపారు.