భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన ఐ.వీ.రెడ్డి
27 Apr, 2017 11:10 IST
ప్రకాశంః గిద్దలూరు పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామిని నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఐవీరెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తన సొంత ఖర్చులతో ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఐవీరెడ్డి మాట్లాడుతూ దేవస్థానంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.