ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు:షర్మిల
26 Nov, 2012 11:25 IST
వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 45 లక్షల పక్కా గృహాలు కట్టించి ఇచ్చారని షర్మిల తెలిపారు. పేదలు తినడానికి సరిపోను 30 కిలోల బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇప్పించే ఏర్పాట్లు చేశారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పేదలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. కానీ ఈ పాలకులు నిరు పేదలను పట్టించుకోవడంలేదన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అటకెక్కాయని అన్నారు. రాష్ర్టంలో విద్యుత్ సమస్య ఏర్పడటానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించిన విధానాలే కారణమని ఆమె విమర్శించారు.
జగనన్న జైలు నుంచి బయటకు వస్తే మళ్లీ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తారని, పింఛన్లు వెయ్యి రూపాయలకు పెంచుతారని షర్మిల హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమ పథకాలను విస్మరిస్తున్న ఇతర పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.