ప్రజాసంకల్పయాత్రకు చురుగ్గా ఏర్పాట్లు
2 Nov, 2017 11:27 IST
వైయస్ఆర్ జిల్లాః వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి 6వతేదీన చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించి వేంపల్లె మండలం ఇడుపులపాయలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైయస్సార్‌సీపీ చక్రాయపేట మండల ఇన్‌చార్జి వైఎస్ కొండారెడ్డి, చక్రాయపేట జెడ్పీటీసీ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3వేల కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేపడుతున్నట్లు వారు తెలిపారు. వీరన్నగట్టుపల్లె నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అడుగడుగునా కటౌట్లను ఏర్పాట్లు చేస్తున్నారు. సభావేదిక, కార్యకర్తల భోజన వసతి, వాహనాల పార్కింగ్‌కు సంబంధించి పనుల కోసం భూమిని జేసీబీలతో చదును చేస్తున్నారు.