ప్రారంభమైన సంఘీభావ పాదయాత్రలు

14 May, 2018 11:41 IST

 వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రలు చేపట్టారు. 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్రలు ప్రతి మండలంలోనూ చేపడుతున్నారు. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయ కర్తలు వీటిని ప్రారంభించి పాదయాత్ర చేపట్టారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైనందువల్లే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనివార్యమైందన్నారు. 161 రోజుల పాటు కొనసాగుతూ, 2000 వేలకిలోమీటర్ల మైలు రాయి దాటుతున్న సందర్బంగా చేపట్టిన సంఘీభావ పాదయాత్రకు పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. అధికారంలోకి వస్తే తాము చేయబోయే కార్యక్రమాలపై ఇప్పటికే ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ, అదే సమయంలో రాష్ట్రానికి చంద్రబాబు, టిడిపి చేస్తున్న వంచనను కూడా చాటుతామన్నారు.

కాగాసోమవారం ఉదయమే అనేక ప్రాంతాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సంఘీభావ యాత్రలను చేపట్టారు. కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణి రెడ్డి,  శ్రీదేవి, కడప జిల్లాలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి, ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి , చిత్తూరు జిల్లాలో రాజీనామా చేసిన ఎంపి మిథున్ రెడ్డి , గుంటూరులో అంబటి రాంబాబులు పాల్గొనగా  అనంతపురం కదిరిలో భారీ సంఖ్యలో హాజరయ్యారు.