ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం: షర్మిల

8 Dec, 2012 13:57 IST
ఆల్వాల్:

టీడీపీ లాగే కాంగ్రెస్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా  ఆల్వాల్ లో శనివారం ఉదయం ఆమె ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఆమెకు వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు. తాగునీరు, కరెంటు బిల్లుల తీరుపై వారు శ్రీమతి షర్మిలకు వివరించారు. ఆమె వారికి సమాధానం చెబుతూ మహానేత తన హయాంలో ఏవిధమైన ధరలూ పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. జగన్ సీఎం అయితే రైతు రాజవుతాడని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దనీ, ధైర్యంగా ఉండాలనీ శ్రీమతి షర్మిల సూచించారు.