పండుగలా ప్రజా సంకల్పయాత్ర
23 Dec, 2018 13:11 IST
జననేతను కలిసేందుకు వేలాదిగా తరలివస్తున్న ప్రజలు
అందరి సమస్యలు వింటూ భరోసా కల్పిస్తున్న వైయస్ జగన్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ప్రజా సంకల్పయాత్ర పండుగ జరుగుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి ధైర్యం చేప్పేందుకు ప్రజా సంకల్పయాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లా జిల్లాకు ప్రజాదరణ పెరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పండుగ వాతావరణ నెలకొంది. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చూసేందుకు, ఆయనతో తమ బాధలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రజల చెంతకు వచ్చిన జననేత అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. 329వ రోజు ప్రజా సంకల్పయాత్ర టెక్కలి నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. వైయస్ జగన్ పాదయాత్రలో సినీనటుడు భానుచందర్ పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఇళ్లు, పంట నష్టపోయాం..
సీతారాంపురం మహిళలు, తిత్లీ తుపాన్ ప్రభావంతో ఇళ్లు, పంట నష్టపోయిన రైతులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం కనీసం పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ సీఎం అయితేనే తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీపీఎస్ విధానం రద్దు చేయండి
సీపీఎస్ విధానంతో కుటుంబాలన్నీ రోడ్డున పడే ప్రమాదం ఉందని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపక్షనే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పాదయాత్రలో జననేతను కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానం రద్దు చేయాలని కోరారు. వైయస్ జగన్ సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ సంస్థను కాపాడండి..
వైయస్ జగన్‌ను టెక్కలి ఆర్టీసీ డిపో ఎన్‌ఎంయూ సంఘం ప్రతినిధులు కలిశారు. ఆర్టీసీ సంస్థను కాపాడాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఎన్‌ఎంయూ సంఘం ప్రతినిధులు వైయస్ జగన్‌ను కోరారు.