ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత

31 Mar, 2016 16:39 IST

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. 2016-17 సంవత్సరానికి గాను ఏపీ ఈఆర్సీ కొత్త టారిఫ్ ను ప్రకటించింది. పెరిగిన విద్యుత్ ఛార్జీల కారణంగా పరిశ్రమలపై రూ.214 కోట్ల భారం పడనుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెరగడం ఇది రెండోసారి. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపున ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది.