కరువుతో కకావికలమైన ఏపీని ఆదుకోండిః విజయసాయిరెడ్డి
20 Mar, 2017 14:51 IST
ఢిల్లీ :ఏపీలో తీవ్రకరువు ఏర్పడిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 13 జిల్లాలకు 10 జిల్లాలు కరువు బారిన పడ్డాయని రాజ్యసభలో వివరించారు. కరువుతో వందలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వేలమంది కార్మికులుగా వలసపోతున్నారని పేర్కొన్నారు. పశుగ్రాసం లేక రైతులు పశువులను కబేళాలకు అమ్ముతున్నారని తెలిపారు. కేంద్రం స్పందించి ఏపీని ఆదుకోవాలని రాజ్యసభలో విజయసాయిరెడ్డి కోరారు.