నువ్వైనా పింఛ‌ను ఇప్పించవా..!

20 Jul, 2016 16:31 IST

నందికొట్కూరు: “కాళ్లు అరిగేలా తిరిగినా...   ఎవరూ ప‌ట్టించుకోవ‌డం లేదు. నాయనా నువ్వైనా నాకు పింఛ‌న్ ఇప్పించి పుణ్యం క‌ట్టుకోవా...” కర్నూలు జిల్లా దుద్యాల గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు రూత‌మ్మ వేదన ఇది. క‌ర్నూలు జిల్లా నందికోట్కూరు ఎమ్మెల్యే ఐజ‌య్య ఎదుట వృద్ధురాలు ఆవేదన వ్య‌క్తం చేసింది. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మంలో భాగంగా కొత్త‌ప‌ల్లిలో ప‌ర్య‌టిస్తున్న ఎమ్మెల్యేకు ఆమె ఎదుట ప‌డింది. “అవ్వ నీకు పింఛ‌ను వ‌స్తోందా” అని ఎమ్మెల్యే ఐజ‌య్య  అడ‌గ్గా... “నాకు 85 ఏళ్లు దాటినా ఇప్ప‌టి దాకా పింఛ‌న్ ఇవ్వ‌ట్లేదు అని రూత‌మ్మ ఆవేద‌న వెలిబుచ్చింది. అవ్వ ఆవేద‌న‌ను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే ఐజ‌య్య జిల్లా అధికారుల‌తో మాట్లాడి పింఛ‌ను వ‌చ్చేలా చేస్తాన‌ని హామీ ఇవ్వ‌డంతో అవ్వ సంతోషం వ్య‌క్తం చేసింది.

అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ... చంద్ర‌బాబు ప్రజాసంక్షేమ ప‌థ‌కాల‌ను కేవ‌లం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే అమ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప‌థ‌కాల‌ను తొల‌గించ‌డ‌మే చంద్ర‌బాబు ధ్యేయంగా పెట్టుకున్నార‌ని విమర్శించారు.