‘ఫీజుల పథకంతోనే లెక్చరర్‌నయ్యా’

30 Nov, 2012 15:03 IST
నర్సందొడ్డి:

పాదయాత్రలో భాగంగా శ్రీమతి వైయస్ షర్మిల వద్దకు ఓ యువతి వచ్చి ఫీజు రీయింబర్సుమెంటు పథకం వల్ల తాను పొందిన ప్రయోజనాన్ని వివరించింది. విరాలు ఆమె మాటల్లోనే.. ‘వైఎస్సార్ నాకు దేవుడు. ఆయన ముఖ్యమంత్రి కాకుంటే నేను ఏ పరిస్థితుల్లో ఉండేదాన్నో నాకు తెలియదు. ఊహించుకుంటేనే భయం వేస్తోంది. మాది నిరుపేద కుటుంబం. ఎమ్మెస్సీలో నాకు సీటు వచ్చినాఫీజు కట్టలేక సీటు వదులుకోవడానికే సిద్ధపడ్డాను. వైయస్ఆర్ దేవుడిలా ఫీజు రీయింబర్సుమెంటు పథకం తెచ్చారు. మళ్లీ నేను కాలేజ్‌కు వెళ్లాను. ఇప్పుడు లెక్చరర్‌గా పని చేస్తున్నాను. నా కుటుంబానికి కొంతలో కొంతైనా ఆసరా అవుతున్నాన’ని నందిమళ్ళ గ్రామానికి చెందిన లెక్చరర్ నమిత చెప్పారు. షర్మిలను కలిసి కృతజ్ఞతలు  తెలిపారు. షర్మిల స్పందిస్తూ ‘నాన్న బతికి ఉండి నీ మాటలు వింటే ఆనందంతో ఆయన కళ్ల వెంట నీళ్లు తిరిగేవిరా’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

పరీక్షలు ఎలా రాయాలక్కా..!

‘మా ఊళ్లో ఏడో తరగతి వరకే ప్రభుత్వ పాఠశాల ఉంది. మరో గత్యంతరం లేక ప్రైవేటుకు వెళ్తున్నాం.. నాన్న కష్టపడి ఫీజులు కడుతున్నారు. స్కూలు వదిలేసిన తరువాత ఇంటి వద్ద కనీసం గంటసేపైనా చదువుకుందామని అనుకుంటే కరెంటు ఉండదు.. ఈ ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వ స్కూళ్లలో చదవనివ్వదు. కనీసం ఇంట్లో కూడా చదువుకోకుండా చేస్తే పరీక్ష లు ఎలా రాయాలక్కా’’ అని నందిమల్ల గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని సువర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. షర్మిల స్పందిస్తూ... ‘కిరణ్‌కుమార్‌రెడ్డి గారూ.. ఈ విద్యార్థుల గోడు మీకు వినిపిస్తోందా! పల్లెల్లో ప్రజల బాధలు మీరు విని తీరాలి’ అని అన్నారు.