అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరు

1 Dec, 2016 18:26 IST
ఖమ్మం : ఎన్నికల మేనిఫెస్టో అమలుపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... సీఎం అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, కాకతీయ పథకాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.