మహానేత..నిను మరువం
27 Aug, 2018 19:14 IST
- ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ రాజశేఖరరెడ్డికి ఘన నివాళి
- రాజన్న రాజ్యం కావాలి..జగనన్న రావాలని నినదాలు
విశాఖ: నమస్తే అన్నా.. నమస్తే అక్కా.. నమస్తే చెల్లెమ్మా.. అంటూ ఆప్యాయంగా పలకరించే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని తెలుగు ప్రజలు మరచిపోలేరు. 2003వ సంవత్సరం పాదయాత్ర ద్వారా తానికాల్వ జంక్షన్ వద్ద వైయస్ రాజశేఖరరెడ్డి బస చేశారు. ఆ ప్రాంతాని వైయస్ విజయమ్మ, షర్మిళమ్మ కూడా వచ్చారని గ్రామస్తులు వైయస్ జగన్‌కు తెలిపారు. తమ ప్రాంతానికి వచ్చిన రాజన్నను విశాఖ జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా యలమంచలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని స్థానికులు కలిసి తమ ప్రాంతంలో మహానేత పాదయాత్ర చేసి మా బతుకులు మార్చారని గుర్తు చేసుకుంటూ సోమవారం వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్ జగన్ పాల్గొని వారి అభిమానాన్ని చూసి ఉప్పొంగిపోయారు. దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో స్వర్ణయుగానికి బాటలు వేసిన ఆ మహానేత ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా తన పాలనా కాలంలో జిల్లాకు ఆయన చేసిన మేలు మరువలేనిది. ఉచిత విద్యుత్ మొదలు జలయజ్ఞం వరకూ నిరంతరం రైతుల కోసం తపిస్తూ.. దండగన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత ఆయనదే అని స్థానికులు కొనియాడారు. తమ కడుపు నింపుకోవడంతోపాటు నలుగురికి అన్నం పెడుతున్నారంటే అది మహానేత చలవే. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాలు, పంట రుణాలు అందించడంతోపాటు పండించిన ధాన్యానికి మద్దతుధర కల్పించి అన్నదాతలకు ఆత్మబంధువయ్యారు.