పెనుకొండలో కోటి సంతకాల సేకరణ ప్రారంభం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా కోటి సంతకాల కార్యక్రమాన్ని పట్టణంలో ప్రారంభించారు. పార్టీ సీఈసీ సభ్యురాలు సానిపల్లి మంగమ్మ, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జాహెదుల్లాఖాన్, జిల్లా కన్వీనర్ నూర్‌బాబా, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జీవీపీ నాయుడు, రూరల్ కన్వీనర్ నీరగంటి వెంకటరాముడు, టౌన్ యూత్ కన్వీనర్, శ్రీరాములు దర్గా సర్కిల్‌లోని వైయస్ఆర్ విగ్రహం వద్ద, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు పెట్రోల్ బంక్ శివారెడ్డి, టౌన్ కన్వీనర్ అత్తర్‌కదీర్‌భాష, ట్రేడ్‌యూనియన్ నాయకులు రియాజ్, మున్వర్, శివశంకరరెడ్డి, విజయ్,ప్రసాద్‌రెడ్డి, తదితరులు శివారెడ్డి కార్యాలయంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కల్యాళదుర్గంలో కూడా ‘జగన్ కోసం జనం సంతకాలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఆ పార్టీ నాయకుడు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి స్వగృహంలో రక్తంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమాన సంఘం తాలుకా అధ్యక్షుడు గోళ్లసూరి, ఎస్సీసెల్ కన్వీనర్ గూబనపల్లి నారాయణ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు... సీబీఐ, కాంగ్రెస్ పెద్దల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.