పై లిన్ బాధిత రైతులకు పరిహారం చెల్లించాలి
15 Oct, 2013 11:50 IST
హైదరాబాద్, 15 అక్టోబర్ 2013:
పై లిన్ తుపాన్ బీభత్సం వల్ల నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి డిమాండ్ చేశారు. పై లిన్ తుపాన్ తాకిడితో శ్రీకాకుళం జిల్లాలో అపారమైన పంటనష్టం జరిగిందని ఆయన మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ విచారం వ్యక్తంచేశారు. కనీసం తాగు నీరు కూడా దొరకక శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పై లిన్ తుపాన్ తీరం దాటిన తర్వాత ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదికి వరద పోటెత్తింది.