పాతపట్నం వైయస్‌ఆర్ ఇల్లు
24 Dec, 2018 16:24 IST
శ్రీకాకుళం: పాతపట్నం నియోజకవర్గం దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిగారి ఇల్లు అని నియోజకవర్గ వైయస్‌ఆర్ సీపీ కన్వీనర్ రెడ్డి శాంతి అన్నారు. అత్యంత వెనుకబడిన జిల్లాను, పాతపట్నం నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని బాగుచేయాలన్నా.. వైయస్‌ఆర్ తనయుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఐదు కోట్ల ప్రజలంతా వైయస్ జగన్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్‌ఆర్ వంశధార ప్రాజెక్టును 85 శాతంపైగా పూర్తి చేశారన్నారు. నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ప్రజాతీర్పును దిక్కరిస్తూ అన్నం పెట్టిన చెయ్యిని మోసం చేసి కలమట వెంకటరమణ తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయాడని మండిపడ్డారు. వంశధార నిర్వాసితులకు వచ్చే డబ్బును టీడీపీ నేతలు పంచుకున్నారన్నారు. కలమట వెంకటరమణకు బుద్ధి చెప్పాలన్నారు. పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా, రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. జిల్లాల్లో గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే వైయస్ జగన్ సీఎం కావాలన్నారు.