పరిహారం చెల్లింపులో వివక్ష..
8 Oct, 2018 12:38 IST
నిర్వాసితులకు న్యాయం జరగకపోతే ఉద్యమిస్తాం..
పోలవరం నిర్వాసితుల గృహాలను పరిశీలించిన వైయస్‌ఆర్‌సీపీ బృందం
పశ్చిమగోదావరిః బుట్టాయపాలెం మండలం వెలుతురువారి పాలెంలో పోలవరం నిర్వాసితులు కోసం నిర్మిస్తున్న గృహాలను వైయస్‌ఆర్‌సీపీ బృందం పరిశీలించింది. వైయస్‌ఆర్‌సీపీ పోలవరం కన్వీనర్ బాలరాజు నేతృతంలో పరిశీలక బృందం పర్యటించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని బాలరాజు ఆగ్రహవ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. నిర్వాసితులకు న్యాయం జరగకపోతే పోలవరం నియోజకవర్గంలోని గిరిజనులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.