పార్వతీపురం బహిరంగ సభ టీడీపీ సమాధికి పునాది..
18 Nov, 2018 11:22 IST
విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త అలగింజ జోగారావు అన్నారు.నిన్న పార్వతీపురం పట్టణంలో జరిగిన వైయస్ జగన్ భారీ బహిరంగ సభ టీడీపీ ప్రభుత్వ సమాధికి పునాదిగా భావిస్తున్నానని తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు అవినీతికి పరాకాష్ఠగా పేర్కొన్నారు.రైతన్నల కష్టం చంద్రబాబుకు పట్టడంలేదని మండిపడ్డారు.ప్రజలను మోసం చేయడం తప్ప న్యాయం చేసేందుకు చంద్రబాబుకు ఆలోచన లేదన్నారు. రైతుల సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.