పన్నుల భారం మోపుతున్న ప్రభుత్వం
4 Dec, 2012 14:58 IST
హైదరాబాద్, 4 డిసెంబర్ 2012:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాస్ర్ట ప్రభుత్వం అన్నిరంగాల్లో పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. గడచిన మూడేళ్లలో 30వేల కోట్ల రూపాయలకు పైగా భారం వేసి ప్రజల నడ్డి విరిచిందన్నారు.
పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే అక్రమ కేసులు పెట్టారని జనక్ ప్రసాద్ విమర్శించారు. వివాదాస్పద 26 జీవోలన్నీ సక్రమమే అయితే శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆ జీవోలతో శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు ఏంటని ఆయన నిలదీశారు.