పలమనేరులో నేడు విజయమ్మ బహిరంగసభ
5 Dec, 2012 08:39 IST
హైదరాబాద్, 5 డిసెంబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ బుధవారం పలమనేరు వెళుతున్నారు. అక్కడ పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్‌రెడ్డి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభలో శ్రీమతి విజయమ్మ పాల్గొంటారు. బుధవారం ఉదయం శ్రీమతి విజయమ్మ హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు వెళతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో పలమనేరు చేరుకుంటారు. పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పలమనేరులో సభ ముగిసిన అనంతరం శ్రీమతి విజయమ్మ మళ్లీ రోడ్డు మార్గంలో బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.