తాగునీటి సమస్యలపై అధికారులు స్పందించాలి
27 Apr, 2017 16:56 IST
సర్వేపల్లి: నియోజకవర్గ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అధికారులకు ఆదేశమిచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై కాకాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ప్రజలంతా తాగునీటి కోసం అల్లాడుతున్నారని, వారి సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.