25న ఫీజు పోరు
23 Oct, 2018 12:14 IST
అమరావతి: అక్టోబర్ 25న వైయస్ఆర్సీపీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో ''ఫీజుపోరు'' పేరుతో అన్ని జిల్లా కేంద్రాలలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రతి పేద విద్యార్ధి ఉన్నత చదవులు చదవాలన్న ఉద్దేశ్యంతో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మహానేత మరణాంతరం ఈ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా కాలేజి ఫీజులు పెంచి, కేవలం రూ.35,000 మాత్రమే చెల్లించడమే కాకుండా, సకాలంలో కాలేజీలకు ఫీజులు చెల్లించకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ఉన్నత చదువులు దూరం చేస్తున్న వైఖరికి నిరసనగా వైయస్ఆర్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో అక్టోబర్ 25వ తేదీన (గురువారం) ''ఫీజుపోరు'' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్కు మెమొరాండం సమర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని విజయసాయిరెడ్డి కోరారు.