నిర్మల్‌లో నేడు విజయమ్మ బహిరంగసభ
16 Dec, 2012 10:47 IST
హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సోమవారంనాడు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పర్యటనకు వెళతారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నానికి నిర్మల్ చేరుకుంటారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భారీ ఎత్తున తన అనుచరులతో కలిసి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మధ్యాహ్నం 1.30 గంటలకు నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. ఇంద్రకరణ్‌రెడ్డి చేరిక సభ ముగిసిన తరువాత అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని రఘురామ్ వివరించారు.