భారీ చేరికలు
19 Nov, 2016 15:20 IST
మంచిర్యాలః తెలంగాణలో వైయస్సార్సీపీలోకి భారీగా వలసలు ఊపందుకున్నాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన డాక్టర్ నిమ్మతోట వెంకటేశ్వర్లు, న్యాయవాది ప్రజ్యోత్ సహా 30 మంది నాయకులు వైయస్సార్సీపీలో చేరారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.