వైయస్ఆర్ కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు
3 Dec, 2016 12:51 IST
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు ప్రస్తుతం అమలు కావడం లేదని.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మళ్లీ ఆ మహానేత పథకాలు అమలు కావాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమని నమ్మి చాలా మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా విశాఖ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జోడుగుళ్లపాలెంకు చెందిన టీడీపీ యువసేన సభ్యులు 70 మందికి పైగా చేరారు. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తూ అహర్నిశలు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైయస్‌జగన్ వెంట తాము నడుస్తామని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.