జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాలెం నీలకంటేశ్వరరెడ్డి
1 Nov, 2017 18:09 IST
తనకల్లు (అనంతపురం): వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొంతలపల్లికి చెందిన పాలెం నీలకంఠేశ్వరరెడ్డిని ఎంపిక చేసినట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి బుద్ధవారం తెలిపారు. ఆయనతో పాటు మండల బీసీ నాయకుడు రాధాకృష్ణ జిల్లా కార్యదర్శిగా ఎంపికయ్యారు. తమను జిల్లా పార్టీ పదవులకు ఎంపిక చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి, సహకరించిన డాక్టర్ సిద్ధారెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.