వైయస్ఆర్‌సీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు
9 Aug, 2018 11:24 IST
- వైయస్ జగన్ వెంట నడవాలని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం
నెల్లూరు: దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు నేదురుమల్లి ఆత్మీయ సమావేశంలో ఆయన వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ వెంట నడవాలని నిర్ణయం తీసకున్నారు. వారం క్రితం నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రకు వెళ్లి పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
ఈ పరిణమాల నేపథ్యంలో జిల్లాలోని నేదురుమల్లి అభిమానులు, ముఖ్య అనుచరులతో నేదురుమల్లి ఆత్మీయ సమావేశాన్ని నగరంలోని స్వర్ణముఖి అతిథి గృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అనుచరులు తమ అభిప్రాయాలను వివరించారు. రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై పాల్గొన్న వారందరూ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పటికే ఆయన అభిమానులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒత్తిడి తెచ్చారు. కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని ఆయన తెలిపారు.