ఇసుక దోపిడీపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసహనం

4 Dec, 2015 15:20 IST
ఏపీః రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దందాపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అక్రమార్జన కోసం అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరపడంపై ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇసుక తవ్వకాల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, భవిష్యత్  తరాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. 

అక్రమ ఇసుక తవ్వకాల వలన భూ గర్భ జాలాలు అడుగంటుతాయని తెలిపిన ట్రిబ్యునల్... రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక తవ్వకాల విషయంలో స్పష్టమైన విధానాలు పాటించాలని సూచించింది. ఇసుక దోపిడిని అడ్డుకున్న కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను ఈ సందర్భంగా పిటీషనర్ ఎన్ జీటీ దృష్టికి తీసుకెళ్లారు.