నంద్యాల ఉప ఎన్నిక విధుల నుంచి డీఎస్పీ తొలగింపు
19 Aug, 2017 11:37 IST
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో అనైతిక చర్యలకు పాల్పడుతున్న అధికార తెలుగు దేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉప ఎన్నిక విధుల నుంచి డీఎస్పీ గోపాలకృష్ణను తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం డీఎస్పీ గోపాలకృష్ణపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్నాచితకా నాయకుల ఇళ్లపై అర్థరాత్రి సోదాలు అంటూ తలుపు తడుతున్నారని, డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గోపాలకృష్ణ స్ధానంలో ఓఎస్‌డీ రవిప్రకాశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈసీ నిర్ణయం పట్ల వైయస్ఆర్‌సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.